న్యూఢిల్లీ: అప్పులు తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్న అదానీ గ్రూప్, సబ్సిడరీల్లో వాటాలను అమ్మాలని చూస్తోంది. సీఎన్‌బీసీ ఆవాజ్ రిపోర్ట్ ప్రకారం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్‌లో 5 శాతం చొప్పున వాటాను విక్రయించాలని ప్రమోటర్లు ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఏడాది జూన్ క్వార్టర్ నాటికి అదానీ పవర్‌లో ప్రమోటర్ల వాటా 72.71 శాతం ఉంటే, అంబుజా సిమెంట్స్‌లో 70.33 శాతం ఉంది. ఈ రిపోర్ట్ దెబ్బకు అదానీ పవర్ షేర్లు గురువారం 3 శాతం పడ్డాయి. అంబుజా సిమెంట్స్ షేర్లు ఒకటిన్నర శాతం పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అదానీ పవర్ షేర్లు 30 శాతం, అంబుజా సిమెంట్స్ షేర్లు 18 శాతం లాభపడ్డాయి.