దూసుకుపోతున్న అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌

దూసుకుపోతున్న అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌
  • ఏప్రిల్- జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.22,570 కోట్లకు పెరిగిన  ఆపరేటింగ్ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌
  • అదరగొడుతున్న ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా బిజినెస్‌‌‌‌‌‌‌‌లు 

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ గ్రూప్ ఇబిటా (ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లు, వడ్డీలు, ఇతరత్రాకు ముందు ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌)  కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 32.87 శాతం పెరిగి రూ. 22,570 కోట్లకు చేరుకుంది. గత 12 నెలలను పరిగణనలోకి తీసుకుంటే  గ్రూప్ ఇబిటా  ఏడాది ప్రాతిపదికన 45.13 శాతం పెరిగి రూ.79,180 కోట్లకు చేరుకుంది. కీలకమైన ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ మంచి పెర్ఫార్మెన్స్ చేస్తోందని అదానీ గ్రూప్ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. మొత్తం ఇబిటాలో కోర్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ల వాటా  80 శాతం ఉందని వివరించింది. 

కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 41.6 శాతం గ్రోత్ నమోదు చేసిందని తెలిపింది.  అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌,  అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అదానీ  ఎనర్జీ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌, అదానీ టోటల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌, అదానీ పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌లలో ఉన్నాయి.  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ – జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోఈ గ్రూప్ నికర లాభం రూ.10,279 కోట్లకు పెరిగింది. ఇది కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  5‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 శాతం ఎక్కువ.  అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌ నికర లాభం ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడాది ప్రాతిపదికన రెండింతలు పెరిగి రూ.1,776 కోట్లకు చేరుకుంది.  

అదానీ గ్రీన్ ఎనర్జీ నికర లాభం రూ. 629 కోట్లకు, అదానీ పవర్ నెట్ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌ రూ.3,490 కోట్లకు, అదానీ పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ లాభం రూ.3,107 కోట్లకు ఎగిసింది. అదానీ టోటల్ గ్యాస్ నికర లాభం  తక్కువగా పెరిగింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ కంపెనీ ప్రాఫిట్ 14.4 శాతం వృద్ధి చెంది రూ.172 కోట్లకు చేరుకుంది.  ఇతర ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా బిజినెస్‌‌‌‌‌‌‌‌లు  అదానీ న్యూ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌, రోడ్స్ అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ కింద ఉన్నాయి.