హిండెన్బర్గ్ మరోసారి అదానీ గ్రూప్ కు సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించింది.అదానీ గ్రూప్కు చెందిన మనీలాండరింగ్, సెక్యూరిటీల విచారణకు సంబంధించి అనేక బ్యాంకు ఖాతా ల ద్వారా రూ.2వేల 6వదల కోట్ల (310 మిలియన్ డాలర్లు) నిధులను స్విస్ బ్యాంకు సీజ్ చేసిందని తెలిపింది.
2021 నాటికే అదానీపై మనీలాండరింగ్, సెక్యూరిటీ ఫోర్జరీ విచారణ లో భాగంగా స్విస్ అధికారులు..అనేక ఖాతాలనుంచి 310 మిలియన్ డాలర్ల నిధులను స్తంభింపజేశారని సోషల్ మీడియా Xద్వారా వెల్లడించింది.
అయితే అదానీ గ్రూప్ ఈ వాదనలను తోసిపుచ్చింది. హిండెన్ బర్గ్ అసత్య ప్రచారం చేస్తోంది.. ఆరోపణలన్నీ నిరాధారమైనవి.. అదానీ గ్రూప్ కు స్విస్ కోర్టు విచారణకు ఎలాంటి సంబంధం లేదని.. నిబంధనలకు లోబడి మా కంపెనీ ఖాతాలున్నాయని అదానీ గ్రూప్ ప్రతినిధి శుక్రవారం విడుదల చేసిన సోషల్ మీడియా బ్లాగ్‌లో తెలిపారు.