హిండెన్ బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చిన అదానీ గ్రూప్

హిండెన్ బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చిన అదానీ గ్రూప్

అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రిసెర్చ్ కంపెనీ ఆరోపణలను ఆదానీ గ్రూప్ ఖండించింది. కేవలం లబ్ది పొందేందుకే హిండెన్ బర్గ్ రిసెర్చ్ కంపెనీ... ప్రకటనలు చేస్తోందని ఆదానీ గ్రాప్ విమర్శించింది. అటు హిండెన్ బర్గ్ కంపెనీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని సెబీ ఛైర్ పర్సన్ మాధవి పూరీ బుచ్ అన్నారు. తమ ఆర్థిక  లావాదేవీలు ఓపెనింగ్ చేస్తున్నవనేని చెప్పారు సెబీ ఛైర్ పర్సన్.

ఆదానీ సీక్రెట్ ఫారిన్ కంపెనీల్లో సెబీ ఛైర్ పర్సన్ మాధవి పూరీ బుచ్, ఆమె భర్తకు వాటాలున్నాయని హిండెన్ బర్గ్ రిసెర్చ్ కంపెనీ సంచలన ఆరోపణలు చేసింది. మారిషస్, బెర్ముడా ఫండ్స్ అని వాటిలో మాధవి ఫూరీ బుచ్ తోపాటు ఆమె భర్త వాటా ఎంతో తెలియదని కామెంట్ చేసింది హిండెన్ బర్గ్ రిసెర్చ్. నిధులను గౌతమ్ బ్రదర్ వినోద్ అదానీ కంట్రోల్ చేస్తున్నారని .. పెట్టుబడులు 2015నాటివని చెప్పింది. అందుకనే గతంలో ఆదానీపై తాము ఇచ్చిన రిపోర్ట్ పై సెబీ చర్యలు తీసుకోలేదని ఆరోపించింది హిండెన్ బర్గ్ రిసెర్చ్ కంపెనీ.