న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ప్రమోటర్ శుక్రవారం అంబుజా సిమెంట్స్‌లో దాదాపు 2.8 శాతం వాటాను జీక్యూజీ పార్టనర్స్ వంటి పెట్టుబడిదారులకు బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ.4,250 కోట్లకు అమ్మింది. రాజీవ్ జైన్- ఈమద్దతుగల జీక్యూజీ పార్టనర్స్ 4.39 కోట్ల కంటే ఎక్కువ షేర్లను కొనుగోలు చేసింది.
రెండు వేర్వేరు లావాదేవీలలో బల్క్ బ్లాక్ డీల్స్ ద్వారా అంబుజా సిమెంట్స్‌లో 1.78 శాతం వాటాను కొనుగోలు చేసింది. షేర్లు ఒక్కొక్కటి సగటు ధర రూ.625.50కి కొన్నది. దీంతో మొత్తం డీల్ విలువ రూ.2,746.79 కోట్లకు చేరుకుంది. ఇది అంబుజా సిమెంట్స్‌లో తన వాటాను 1.35 శాతం నుండి 3.13 శాతానికి పెంచుకుంది.