వంట గ్యాస్‌‌‌‌‌‌‌‌లో  గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ .. 2.3 శాతం వరకు బ్లెండ్ చేసి సరఫరా చేస్తున్న  అదానీ గ్రూప్

వంట గ్యాస్‌‌‌‌‌‌‌‌లో  గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ .. 2.3 శాతం వరకు బ్లెండ్ చేసి సరఫరా చేస్తున్న  అదానీ గ్రూప్
  • ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ, గెయిల్ చేపడుతున్న ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ల కంటే ఇదే పెద్దది
  • ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైడ్రోజన్ బ్లెండింగ్ 8 శాతం వరకు

న్యూఢిల్లీ: కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు నేచురల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌లో గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ను కలిపి  ఇండ్లకు అదానీ గ్రూప్ సరఫరా చేయడం మొదలు పెట్టింది. వంట గ్యాస్‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌లో ఈ విధానాన్ని ఫాలో అవుతోంది.  కుకింగ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌ను సప్లయ్ చేసే అదానీ టోటల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌   పైప్డ్‌‌‌‌‌‌‌‌ నేచురల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌ (పీఎన్‌‌‌‌‌‌‌‌జీ) లో 2.2–2.3 శాతం గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ను కలిపి, అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లోని శాంతిగ్రామ్‌‌‌‌‌‌‌‌లో సప్లయ్ చేస్తోంది.

పర్యావరణానికి హాని చేయని విధానాల్లో హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేస్తున్నామని, కేవలం నేచురల్‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌నే వాడడం కంటే హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ను కలపడం ద్వారా తక్కువ కార్బన్ ఉద్గారాలకే పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, వేడిని ఉత్పత్తి చేయొచ్చని వివరించింది. అదానీ టోటల్ గ్యాస్  వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలక్ట్రాలసిస్‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ ద్వారా  హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌, ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌గా వేరు చేస్తోంది.

ఈ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ కోసం  విండ్‌‌‌‌‌‌‌‌, సోలార్ కరెంట్‌‌‌‌‌‌‌‌ వంటి రెన్యువబుల్ ఎనర్జీని వాడుతోంది. గ్రీన్ హైడ్రోజన్ కలిపిన పీఎన్‌‌‌‌‌‌‌‌జీని ఇండ్లకు, పరిశ్రమలకు  వంట అవసరాల కోసం సరఫరా చేస్తోంది.  హైడ్రోజన్ బ్లెండింగ్  సిస్టమ్‌‌‌‌‌‌‌‌ను సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించామని  అదానీ టోటల్‌‌‌‌‌‌‌‌ గ్యాస్ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. 4 వేల కమర్షియల్ కన్జూమర్లకు ఈ  గ్యాస్‌‌‌‌‌‌‌‌ను సప్లయ్ చేస్తామని తెలిపింది. ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ కూడా గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ కలిసిన నేచురల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌ను  గుజరాత్‌‌‌‌‌‌‌‌ సూరత్‌‌‌‌‌‌‌‌లోని కవాస్‌‌‌‌‌‌‌‌లో ఇండ్లకు సప్లయ్ చేస్తోంది. మరో ప్రభుత్వ సంస్థ గెయిల్ కూడా మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పైలెట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా గ్రే హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ను  సీఎన్‌‌‌‌‌‌‌‌జీలో కలిపి సరఫరా చేస్తోంది. వీటితో పోలిస్తే అదానీ టోటల్‌‌‌‌‌‌‌‌ గ్యాస్ చేపట్టిన ప్రాజెక్ట్ అతిపెద్దదిగా చెప్పొచ్చు. 

సిలిండర్లలో పెరగనున్న హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌..

వంట గ్యాస్‌‌ సిలిండర్లలో హైడ్రోజన్ వాటాను మరింత పెంచాలని అదానీ టోటల్ గ్యాస్ చూస్తోంది. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో పీఎన్‌‌‌‌‌‌‌‌జీలో  5 శాతం నుంచి 8 శాతం  వరకు   గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ను కలపాలనే ప్లాన్‌‌‌‌‌‌‌‌లో ఉంది. తనకు లైసెన్స్ ఉన్న   మిగిలిన సిటీలలో కూడా ఈ గ్యాస్‌‌‌‌‌‌‌‌ను సప్లయ్ చేయనుంది.  ‘కార్బన్‌‌‌‌‌‌‌‌ ఉద్గారాలను తగ్గించడంలో ఇది  కీలక ముందడుగు. నేచురల్‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌లో గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ను కలపడం ద్వారా  గ్రీన్ హౌస్‌‌‌‌‌‌‌‌ గ్యాస్ ఉద్గారాలను తగ్గించొచ్చు. ఎనర్జీ సెక్యూరిటీని మెరుగుపరచొచ్చు. సస్టయినబుల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలవొచ్చు’ అని కంపెనీ సీఈఓ సురేష్  పీ మంగ్లాని అన్నారు. కాగా, గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌తో కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ, దీనిని సప్లయ్ చేయడంలో ఇబ్బందులు లేకపోలేదు.  

హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ను సరఫరా చేసే పైప్‌‌‌‌‌‌‌‌లైన్లు, ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్లు  తొందరగా పాడైపోతాయి. పైప్‌‌‌‌‌‌‌‌లైన్లు లేదా ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్లపై ఎటువంటి ప్రభావం లేకుండా ఉండాలంటే  నేచురల్‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌లో 10 శాతం వరకు మాత్రమే హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ను బ్లెండ్ చేయడానికి వీలుంది.  పైప్‌‌‌‌‌‌‌‌లైన్ల  మందాన్ని పెంచడం ద్వారా , వీటి తయారీ మెటీరియల్స్‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరచడం ద్వారా నేచురల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌లో 30 శాతం వరకు హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ను బ్లెండ్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వంట గ్యాస్‌‌‌‌‌‌‌‌లో నేచురల్ గ్యాస్ వాటా తగ్గుతుంది. ఇండియా గ్యాస్ దిగుమతులు దిగొస్తాయి. ఇంకా హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ను వాటర్, బయోమాస్‌‌‌‌‌‌‌‌ నుంచి  ఉత్పత్తి చేయొచ్చు. కానీ, దీని ఉత్పత్తి ఖర్చెక్కువ.