Adani Group Stock: అదానీ షేర్లు అన్నీ ఢమాల్.. 20 శాతం తగ్గిన ధరలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్

Adani Group Stock: అదానీ షేర్లు అన్నీ ఢమాల్.. 20 శాతం తగ్గిన ధరలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్

అదానీ.. ఇండియాలోనే నెంబర్ వన్ ధనవంతుడు. అలాంటి అదానీపై ఇప్పుడు అమెరికాలో కేసులు నమోదు అయ్యాయి. అరెస్ట్ వారెంట్ల వరకు ఇష్యూ వెళ్లింది. ఏకంగా 2 వేల 100 కోట్ల రూపాయల లంచం ఆరోపణలతో.. అదానీ కంపెనీకి చెందిన షేర్లు అన్నీ ఢమాల్ అయ్యాయి. మార్కెట్ ప్రారంభం కాగానే.. అదానీపై అవినీతి ఆరోపణల వార్తలతో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున అమ్మకాలకు దిగారు. దీంతో అదానీకి చెందిన అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏకంగా 20 శాతం వరకు అదానీ షేర్లు పడిపోయాయి.

బిలియనీర్  అదానీపై ఆరోపణలు, అమెరికాలో కేసు నమోదు క్రమంలో అదానీ గ్రూప్ షేర్లు భారీ స్థాయిలో పడిపోయాయి. గురువారం నాడు అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన అన్నీ షేర్ల ధరలు 20 శాతం క్షీణించాయి. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టుల  కోసం అదానీ భారతీయ అధికారులకు లంచం ఇచ్చినట్లు బుధవారం అమెరికన్ అధికారులు వెల్లడించారు. 

ALSO READ : అదానీ 2 వేల 100 కోట్ల లంచం ఎవరికి ఇచ్చారు.. ఎందుకిచ్చారు.. దేనికోసం ఇచ్చారు..?


అదానీపై కేసు, ఆరోపణలతో అదానీ ఎనర్జీ సోల్యూషన్స్ షేర్లు 20శాతం క్షీణించాయి. అదేవిధంగా అదానీ గ్రీన్ షేర్లు కూడా 18 శాతం తగ్గుదల చవిచూశాయి.అదానీ ఎంటర్ ప్రైజెస్, అంబుజా సిమెంట్స్ , ఏసీసీ, అదానీ పోర్ట్స్, ఎన్డీటీవీ , అదానీ పవర్ , అదానీ టోటల్ గ్యాస్ తో సహా ఇతర గ్రూప్ కంపెనీలు 10 శాతం పడిపోయాయి.