న్యూఢిల్లీ : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి జైపూర్, తిరువనంతపురం, గౌహతి, లక్నో, మంగళూరు, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లను దక్కించుకున్నందకు అదానీ గ్రూప్ ఇంకా రూ.2,800 కోట్లను చెల్లించాలని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు.
అదానీ గ్రూప్ 2021 లో రూ.2,440 కోట్లను చెల్లించింది. ఏఏఐ 2019, 2021 లో చేసిన ఇన్వెస్ట్మెంట్లను అదానీ గ్రూప్ తిరిగి ఇచ్చేయనుంది. ఎయిర్‌పోర్ట్‌లు వేసే టారిఫ్‌లు ఐదేళ్ల పీరియడ్ కోసం ఫిక్స్డ్ గా ఉంటాయి.