అదానీ గ్రూప్​కు రూ.36 వేల కోట్ల ప్రాజెక్టు

అదానీ గ్రూప్​కు  రూ.36 వేల కోట్ల ప్రాజెక్టు

న్యూఢిల్లీ:  బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ రూ.36 వేల కోట్ల విలువైన ముంబై మోతీలాల్​రీడెవలప్​మెంట్​ ప్రాజెక్టును గెలుచుకుంది. మొత్తం 143 ఎకరాల్లో ఇది ప్రాజెక్టును నిర్మిస్తుంది. త్వరలోనే లెటర్​ ఆఫ్​ అలాట్​మెంట్​ను జారీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అదానీ గ్రూప్​ ఇది వరకే ధారావి స్లమ్​ రీడెవలప్​మెంట్​ప్రాజెక్టును దక్కించుకుంది. బొంబాయి హైకోర్టు గత వారం మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ (మాడా) కు మోతీలాల్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రీడెవలప్​మెంట్​ చేయడానికి అనుమతి ఇచ్చింది. 

 మోతీలాల్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆధునిక అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లుగా తీర్చిదిద్దుతారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏడేళ్లు పడుతుంది. డిజైన్​, అప్రూవల్స్​, ఇన్​ఫ్రా డెవెలప్​మెంట్​, నిర్మాణం, పునరావాసం వంటి పనులను ప్రత్యేక డెవెలప్​మెంట్​ఏజెన్సీయే చూస్తుంది. మోతీలాల్​ప్రాజెక్టు వల్ల 3,372 మందికి పునరావాసం దొరుకుతుంది.