అదానితో నో అగ్రిమెంట్!..ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లుల వసూలుపై ఎలాంటి ఒప్పందం జరగలే

  • ఎంవోయూపై సంతకాలు చేయలేదు
  • ఆర్టీఐ దరఖాస్తుకు సర్కారు సమాధానం
  • ఆగస్టు 7న ఆన్సర్ ఇచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్: పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వసూలును అదాని సంస్థకు అప్పగించినట్టు జరుగుతున్న ప్రచారం తప్పని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ దక్షిణ మండల విద్యుత్  పంపిణీ సంస్థ(టీఎస్ ఎస్పీడీసీఎల్) వెల్లడించింది.  సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానంగా వివరాలను వెల్లడించింది.  హైదరాబాద్ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త, www.urti.inవ్యవస్థాపకుడు కరీమ్ అన్సారీ టీజీఎస్పీడీసీఎల్- అదానీ గ్రూప్ మధ్య ఎమైనా ఒప్పందాలు జరిగాయా? అని సమాచారం కోరుతూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. 

ALSO READ | Sebi employees protest: చైర్‌పర్సన్ మాధబి పూరీ రాజీనామా చేయాలి: సెబీ ముందు ఉద్యోగుల నిరసన

దీనికి సమాధానంగా ఆగస్టు 7వ తేదీన ఎస్పీడీసీఎల్  సమాధానం ఇచ్చింది.  టీజీఎస్పీడీసీఎల్- అదానీ గ్రూప్ మధ్య విద్యుత్ ప్రైవేటీకరణకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరలేదని తాను దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ కు ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని కరీం తెలిపారు. దీంతో విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేటీకరణపై జరగుతున్న ప్రచారంపై ప్రజలకు స్పష్టత వచ్చేసింది.