పతంజలిలో ఇన్వెస్ట్ చేసిన అదానీ ఇన్వెస్టర్‌‌‌‌

పతంజలిలో ఇన్వెస్ట్ చేసిన అదానీ ఇన్వెస్టర్‌‌‌‌

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ షేర్లలో ఇన్వెస్ట్ చేసి భారీగా లాభాలు పొందిన జీక్యూజీ పార్టనర్స్‌‌ తాజాగా బాబా రామ్‌‌దేవ్‌‌ ప్రమోట్ చేస్తున్న ఎఫ్‌‌ఎంసీజీ కంపెనీ పతంజలి ఫుడ్స్‌‌లో రూ.2,400 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఆఫర్‌‌‌‌ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌ఎస్‌‌) లో పాల్గొన్న జీక్యూజీ  కంపెనీలో 5.96 శాతం వాటాను (2.15 కోట్ల షేర్లను) కొనుగోలు చేసింది. ఓఎఫ్‌‌ఎస్‌‌లో  రిటైల్ ఇన్వెస్టర్ల కోసం  షేరు రూ.1000 దగ్గర అందుబాటులో ఉండగా, నాన్‌‌ రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 1,103.80 దగ్గర  అమ్మారు. 

ALSO READ:అది అవినీతి నేతల కూటమి.. ప్రతిపక్షాల మీటింగ్​పై బీజేపీ చీఫ్​ నడ్డా ఫైర్​

పతంజలి షేర్ హోల్డర్లు ఓఎఫ్‌‌ఎస్‌‌లో 7 శాతం వాటాను అమ్మారు. ఇందులో 2.28 కోట్ల షేర్లను నాన్ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించారు. శుక్రవారం నాటికి నాన్ రిటైల్ పోర్షన్ 2  రెట్లు,   రిటైల్ పోర్షన్ 3 రెట్లు సబ్‌‌స్క్రయిబ్‌‌ అయ్యాయి. రాజీవ్ జైన్ నేతృత్వంలోని జీక్యూజీ పార్టనర్స్ ఈ ఏడాది  మార్చిలో వెలుగులోకి వచ్చింది. హిండెన్‌‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు అదానీ గ్రూప్ షేర్లు ఏకంగా 80 శాతం వరకు పడిపోయిన టైమ్‌‌లో అదానీ గ్రూప్‌‌లో  భారీగా ఇన్వెస్ట్ చేసి, మంచి లాభాలను ఈ కంపెనీ సంపాదించింది. పతంజలి ఫుడ్స్ షేర్లు సోమవారం సెషన్‌‌లో 2.43 శాతం పెరిగి రూ.1,254.70 దగ్గర ముగిశాయి.

మరిన్ని వార్తలు