ఇక అదానీ సెమీకండక్టర్లు

ఇక అదానీ సెమీకండక్టర్లు
  • మహారాష్ట్రలో ప్లాంట్​పెట్టుబడి రూ. 84వేల కోట్లు

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ టవర్ సెమీకండక్టర్,  అదానీ గ్రూప్ కలసి మహారాష్ట్రలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్​ను చేపట్టనున్నాయి. ఇందుకోసం కోసం రూ.84 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ షిండే ‘ఎక్స్’ పోస్ట్​ ద్వారా తెలిపారు. దీనికి 40 వేల వేఫర్ల సామర్థ్యం ఉంటుందని వెల్లడించారు.  

ఫాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాన్ గత ఏడాది జూలైలో భారతీయ కంపెనీ వేదాంతతో  19.5 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ జాయింట్ వెంచర్ నుంచి వైదొలిగింది. మనదేశంలో చిప్​ల తయారీకి 3 బిలియన్​డాలర్ల పెట్టుబడి పెట్టడానికి అబుదాబికి చెందిన నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్,  టవర్ సెమీకండక్టర్ల మధ్య చర్చలు జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 2026 నాటికి సెమీకండక్టర్ మార్కెట్ విలువ 63 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా.