న్యూఢిల్లీ : బిల్లులు చెల్లించకపోవడంతో అదానీ పవర్బంగ్లాదేశ్కు కరెంటు సరఫరాను తగ్గించింది. దీంతో బంగ్లాదేశ్ రాత్రిపూట 1,600 మెగావాట్ల విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. 1,496 మెగావాట్ల ప్లాంట్ ఇప్పుడు ఒకే యూనిట్ నుంచి 700 మెగావాట్లతో పనిచేస్తోంది. అంతకుముందు, అదానీ పవర్ బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (పీడీబీ)కి అక్టోబర్ 30 నాటికి బకాయిలను చెల్లించాలని కోరుతూ లెటర్ పంపింది.
బిల్లులను క్లియర్ చేయకపోవడంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం అక్టోబర్ 31 నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశామని కంపెనీ వర్గాలు తెలిపాయి. పీడీపీ నుంచి అదానీ పవర్‌కు 22 మిలియన్ డాలర్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని తెలుస్తోంది. పీడీపీ వారానికొకసారి అదానీ పవర్‌కు సుమారు 18 మిలియన్ డాలర్లు చెల్లిస్తోంది. డాలర్ కొరత కారణంగా డబ్బులు బ్యాంకులు జమ కాలేదని బోర్డు వర్గాలు తెలిపాయి.