డేటా సెంటర్ల విస్తరణకు అదానీ రూ.33,200 కోట్ల పెట్టుబడులు!

డేటా సెంటర్ల విస్తరణకు  అదానీ రూ.33,200 కోట్ల పెట్టుబడులు!

న్యూఢిల్లీ: డేటా సెంటర్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను విస్తరించాలని అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం  400 కోట్ల డాలర్ల (సుమారు రూ.33,200 కోట్ల) ను ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉంది. టెక్‌‌‌‌‌‌‌‌ కంపెనీల నుంచి గత ఆరు నెలలుగా డేటా సెంటర్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లకు డిమాండ్ పెరగడమే కారణం. అదానీ డేటా సెంటర్ బిజినెస్ అదానీ కనెక్స్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్ లిమిటెడ్   ప్రస్తుతం  17 మెగావాట్స్ కెపాసిటీని  ఆపరేట్ చేస్తుండగా, మరో  210 మెగావాట్స్‌‌‌‌‌‌‌‌ కెపాసిటీ గల డేటా సెంటర్లను నిర్మిస్తోంది. 

తన కెపాసిటీని ఇంకో రెండు నుంచి ఐదేళ్లలో 1.5 గిగావాట్లకు పెంచుకోవాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది.   అదానీ కనెక్స్‌‌‌‌‌‌‌‌కు 2.5 శాతం మార్కెట్ వాటా ఉంది. కంపెనీ తాజాగా  50–100 మెగావాట్స్ సైజ్ ఉండే  ఆర్డర్లను దక్కించుకుంది. రెండేళ్ల క్రితం ఈ సైజ్ కేవలం 5–10 మెగావాట్స్ మాత్రమే ఉండేది. అదానీ కనెక్స్‌‌‌‌‌‌‌‌కు  ఆర్డర్లు పెరిగితే అదానీ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా లాభపడతాయని ఎనలిస్టులు చెబుతున్నారు.  డేటా సెంటర్లను ఆపరేట్ చేయడానికి అయ్యే ఖర్చులో 60 శాతం పవర్ ఖర్చులే ఉంటాయన్నారు.