
స్టాక్ మార్కెట్ మాయ ఎలా ఉంటుందో చూపించింది.. 2024, జూన్ 3వ తేదీ స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. ఆ పెరగటం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు.. చిన్నా చితక షేర్లు అన్నీ ఢమాల్ అంటే.. అదానీ షేర్లలో బంగారం పడింది. అది ఇదీ అని లేదు అదానీకి చెందిన అన్ని షేర్లు రాకెట్ లా దూసుకెళ్లాయి.
ఏ షేర్లు ఎంత పెరిగాయంటే..
>>> అదానీ పోర్ట్స్ షేర్ 152 రూపాయలు పెరిగింది. 1,590 దగ్గర క్లోజ్ అయ్యింది. 10.62 శాతం పెరిగింది
>>> అదానీ పవర్ షేర్ 122 రూపాయలు పెరిగి.. 878 దగ్గర క్లోజ్ అయ్యింది. 16.17 శాతం పెరిగింది
>>> అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్ 104 రూపాయలు పెరిగి.. 1,227 దగ్గర క్లోజ్ అయ్యింది. 9.28 శాతం పెరిగింది
>>> అదానీ విల్ మర్ షేర్ 13.45 రూపాయలు పెరిగి.. 369 దగ్గర క్లోజ్ అయ్యింది. 3.78 శాతం పెరిగింది.
>>> అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ 233 రూపాయలు పెరిగి.. 3 వేల 645 దగ్గర క్లోజ్ అయ్యింది. 6.86 శాతం పెరిగింది.
>>> అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ 129 రూపాయలు పెరిగి.. 2 వేల 038 దగ్గర క్లోజ్ అయ్యింది. 6.79 శాతం పెరిగింది.
>>> అదానీకి చెందిన అంబూజా సిమెంట్ షేర్ 39 రూపాయలు పెరిగి.. 674 దగ్గర క్లోజ్ అయ్యింది. 6.30 శాతం పెరిగింది.
>>> అదానీ టోటల్ గ్యాస్ షేర్ 86 రూపాయలు పెరిగి.. 1,126 దగ్గర క్లోజ్ అయ్యింది. 8.34 శాతం పెరిగింది.
>>> అదానీకి చెందిన NDTV షేర్ 16 రూపాయలు పెరిగి.. 263 దగ్గర క్లోజ్ అయ్యింది. 6.47 శాతం పెరిగింది.
ఓవరాల్ గా 2024, జూన్ 3వ తేదీన ఆరున్నర గంటల్లోనే.. అదానీ షేర్లు అన్నీ రాకెట్ గా లాభాల్లోకి వచ్చాయి. ఓవరాల్ గా 21 లక్షల షేర్ల లావాదేవీలు జరిగినట్లు అంచనా. మొత్తంగా ఆరున్నర గంటల్లోనే అదానీ లక్షా 40 వేల కోట్ల సంపద పెంచుకున్నారు.
ఇదే సమయంలో మిడ్ క్యాప్ షేర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. మంచి లాభాల్లో ఉన్న మిడ్ క్యాప్ షేర్లు అన్నీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మెయిన్ గా అదానీ షేర్లలో ర్యాలీ జరిగింది. అదానీ మళ్లీ దేశంలోనే నెంబర్ వన్ కుబేరుడుగా అవతరించాడు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ మళ్లీ మోడీనే వస్తున్నాడని చెప్పటంతో.. అదానీ షేర్లకు లాభాల రెక్కలు వచ్చాయి.