రూ.6వేల కోట్లతో అదానీ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు

రూ.6వేల కోట్లతో అదానీ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు.. అమెరికా మెడికల్​ రీసెర్చ్ సంస్థ​ మయో క్లినిక్‌‌‌‌తో కలిసి ముంబై,  అహ్మదాబాద్‌‌‌‌లలో రెండు 1,000 బెడ్ల మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులను, మెడికల్​ కాలేజీలను నిర్మించనుంది. ఇందుకోసం రూ.6,000 కోట్లు ఖర్చు చేయనుంది. 

సమాజసేవ కోసం రూ.10 వేల కోట్లు విరాళం ఇస్తామనని గౌతమ్ అదానీ గత వారం తన చిన్న కుమారుడు జీత్ వివాహం చేసుకున్నప్పుడు ప్రకటించారు. ఆస్పత్రులకు నిధులను నిధులను ఆ మొత్తం నుంచే కేటాయిస్తారు. తమ ఆస్పత్రులకు  మయో క్లినిక్ సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తుందని అదానీ గ్రూప్  తెలిపింది. 

మనదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సరసమైన, ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ,  వైద్య విద్యను అందిస్తామని హామీ ఇచ్చింది.