అదానీ విల్మార్ లాభం రూ. 313 కోట్లు

అదానీ విల్మార్ లాభం రూ. 313 కోట్లు

న్యూఢిల్లీ: ఆదాయం పెరగడంతో అదానీ విల్మార్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో రూ. 313.20 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది.   క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.78.92 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-–జూన్ కాలంలో మొత్తం ఆదాయం రూ.12,994.18 కోట్ల నుంచి రూ.14,229.87 కోట్లకు పెరిగింది.  

 అదానీ విల్మార్.. అదానీ గ్రూప్,  సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన విల్మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య జాయింట్ వెంచర్. ఇది వంటనూనెలతోపాటు బియ్యం, పిండి వంటి ఎఫ్​ఎంసీజీ ప్రొడక్టులను 'ఫార్చ్యూన్' బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అమ్ముతోంది.