న్యూఢిల్లీ: వంటనూనెల తయారీ సంస్థ అదానీ విల్మార్ లిమిటెడ్ అధిక ఆదాయం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.311.02 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.130.73 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం జులై–-సెప్టెంబర్ కాలంలో మొత్తం ఆదాయం రూ.12,331.20 కోట్ల నుంచి రూ.14,565.30 కోట్లకు పెరిగింది.
అదానీ విల్మార్ అనేది అదానీ గ్రూప్, సింగపూర్‌కు చెందిన విల్మార్‌ల మధ్య జాయింట్ వెంచర్. అదానీ విల్మార్ ఫార్చ్యూన్‌తో సహా వివిధ బ్రాండ్‌ల కింద వంట నూనెలు, ఇతర ఆహార పదార్థాలను అమ్ముతుంది. ఎడిబుల్ ఆయిల్స్ ఆదాయం వార్షికంగా 21 శాతం పెరిగిందని, ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ ఆదాయం 34 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది.