న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులు విజృంభిస్తున్నా మనం భయపడాల్సిన అవసరం లేదని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా అన్నారు. మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ అద్భుతంగా జరిగిందని, ట్రాక్ రికార్డు బాగుందని ఆయన పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించిన గైడ్ లైన్స్ కు కట్టుబడి ఉండాలని ప్రజలకు ట్విటర్ లో ఆయన విజ్ఞప్తి చేశారు.
కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ పాజిటివ్ కేసుల శాంపిల్స్ ను ఐఎన్ఎస్ఏసీవోజీ ల్యాబ్ కు పంపాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లెటర్ రాసింది. ప్రస్తుత పరిణామాలపై ఐఎన్ఎస్ఏసీవోజీ ఓ కన్నేసి ఉంచిందని తెలిపింది.