ఖమ్మంలో దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ : ఆదర్శ్ సురభి

ఖమ్మం టౌన్, వెలుగు  :  సిటీలోని గణేశ్ బోనాల నిలయంలో శనివారం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ చేయూతతో 25 మంది దివ్యాంగులకు రూ.3 లక్షల విలువ చేసే వీల్ చైర్ల ను ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి అందజేశారు.

బీటెక్ చదువుతున్న స్టూడెంట్ కు ట్రస్ట్ నుంచి రూ.లక్ష ఇచ్చారు.  కార్యక్రమంలో ఫౌండర్ బయ్యన బాబు, అధ్యక్షుడు బోనాల రామకృష్ణ, కార్యదర్శి బండి నాగేశ్వరరావు, కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, కోశాధికారి పసుమర్తి రంగారావు, బట్టినేని నాగ ప్రసాద్, వాసిరెడ్డి అర్జున రావు, ముదాలగర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.