ఖమ్మం టౌన్, వెలుగు : కాల్వల్లో చెత్తాచెదారం వేసే వారికి ఫైన్ వేయాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో శానిటేషన్ వర్క్స్ ను ఆయన పరిశీలించారు.
మురుగు కాల్వల శుభ్రత ఎక్కడ వరకు చేస్తున్నారో గ్యాంగ్ వర్క్స్ ను అడిగి తెలుసుకున్నారు. కాళోజీ నారాయణరావు పార్కు ను విజిట్ చేశారు. వర్షాకాలం వస్తున్నందున పూడుకుపోయిన కాల్వలన్నింటిని జేసీబీలు, గ్యాంగ్ వర్క్స్ తో శుభ్రం చేయించాలని అధికారులకు సూచించారు.