
వామ్మో ఇదేం మాయ రోగం..ఎంతకు తెగించింది. చదువులకు నెలవైన యూనివర్సిటీలో మందు కొడతదట.. సిగరెట్ కాలుస్తదట.. పైగా ఇది మా హక్కు అంటూ రుబాబ్ చేస్తోంది.. చేసింది తప్పు.. పైగా సమర్థిస్తూ డైలాగులు.. ఆమె చేసింది సరైంది కాకపోయినా గట్టిగా వాదిస్తోంది. కోల్ కతా జాదవ్ పూర్ యూనివర్సిటీలో మద్యపానం నిషేధం తర్వాత ఓ లేడీ స్టూడెంట్ చేసిన వ్యాఖ్యలు.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ స్టూడెంట్గా ఇలా మాట్లాడటానికి ఏమీ అనిపించడం లేదా అని బూతులు తిడుతున్నారు. ఇటీవల డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి మృతిచెందాడు. దీంతో గుర్తింపు విద్యార్థులకు మాత్రమే కళాశాలలోకి పర్మిషన్ ఇవ్వాలని యూనివర్సిటీ నిర్ణయించింది. తక్షణమే నిబంధనలు అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే మద్యపాన నిషేధం తరువాత ఒక విద్యార్థి మాట్లాడుతూ..యూనివర్సిటీ తనకు రెండో ఇల్లు లాంటిదని.. క్యాంపస్ లోపల పొగతాగడం.. మద్యం సేవించే హక్కు మాకు ఉందంటూ వాదిస్తోంది. నీకు ఎవరు ఈ హక్కులు కల్పించారు అని ప్రశ్నించగా.. నాకు ఈ హక్కు ఎవరూ ఇవ్వాల్సిన అవసరం లేదు.. నాకు హక్కు ఉంది అని గట్టిగా వాదిస్తోంది.. ఆ విద్యార్థిని మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సీరియస్ గా స్పందించారు. ఆమెది మెచూరిటీ లేని స్టేట్ మెంట్ అని ట్రోల్ చేస్తున్నారు.
Leftist Bongs thinks #JadavpurUniversity as their second Home ?, so it is their right to smoke ? and drink ? inside the campus, so oppose CC TV camera.
— Oxomiya Jiyori ?? (@SouleFacts) August 19, 2023
Now I came to understand why they stay in campus till 45-50 years, only to smoke & drink thinking this as their second home pic.twitter.com/4sHwPXTd0u