2070 నాటికి భారత జీడీపీలో 25 శాతం క్షీణత

2070 నాటికి భారత జీడీపీలో 25 శాతం క్షీణత

వాతావరణ మార్పులతో భారత్​ జీడీపీకి 2070 నాటికి 24.7 శాతం నష్టం వాటిల్లవచ్చని ఆసియన్​ డెవలప్​మెంట్​ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఈ నష్టం ఆసియా పసిఫిక్​ ప్రాంతంలో 16.9 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. 

  • పెరుగుతున్న సముద్ర మట్టాలు, తరిగిపోతున్న కార్మిక ఉత్పాదకతలు ఈ నష్టానికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నది. 
  • తక్కువ ఆదాయం, దుర్బల ఆర్థిక వ్యవస్థలపై వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది. 
  •  2070 నాటికి తీర ప్రాంతాల్లో వరదల వల్ల ఈ ప్రాంతంలోని 30 కోట్ల మంది ప్రమాదంలో పడతారని, కోట్లాది రూపాయల తీర ప్రాంత ఆస్తులు దెబ్బ తినొచ్చని చెప్పింది. 
  •  2000 నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా గ్రీన్​హౌస్​ వాయువుల ఉద్గారంలో అభివృద్ధి చెందుతున్న ఆసియా వాటా ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది.