జున్ను పాలు ఆవు లేదా గేదె ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలు. సాధారణ పాలను కూడా బాగా మరగకాచితే కూడా జున్ను తయారుచేసుకోవచ్చును. ఈ జున్నులో పాలకంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
ప్రస్తుతం ప్రతి ఆహారంలో జున్ను కలుపుతున్నారు. పిజ్జా, బర్గర్‌ల రుచిని పెంచే చీజ్‌లో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్లు మరియు అనేక ముఖ్యమైన ఖనిజాలు జున్నులో ఉంటాయి. పిజ్జాలో జున్ను కలపకపోతే టేస్ట్ రాదు. అంతేకాదు మనస్సును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక పోషకాలు జున్నులో ఉన్నాయి. ప్రొటీన్, కాల్షియం, విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ బి12, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు చీజ్‌లో ఉంటాయి.
- బక్కగా, సన్నగా ఉండేవారు జున్ను తింటుంటే వళ్లు చేస్తారు.
- జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి, జున్ను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
- జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది.
- ప్రోటీన్, కాల్షియం మరియు విటమిన్ డిని అందిస్తుంది, ఇది ఎముకలను బలపరుస్తుంది.
- విటమిన్ బి12, విటమిన్ డి మరియు విటమిన్ సి చీజ్‌లో ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల, శరీరం వ్యాధుల ప్రమాదానికి దూరంగా ఉంటుంది
- జున్నులో రక్తపోటును (BP)తగ్గించే పోషకాలున్నాయి.
- జున్ను తినడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.. మాససిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
- ఒత్తిడిలో ఉన్న సమయంలో జున్ను తింటే ఉపశమనం కలుగుతుంది.
- జున్ను తీసుకోవడం వల్ల ఎముకలే కాదు దంతాలు, కండరాలు కూడా పటిష్టంగా మారతాయి.
- జున్నును డైట్‌లో చేర్చుకోవడం వల్ల అందులో ఉండే ఫైబర్...మలబద్ధకం సమస్య దూరం చేయడంతో పాటు జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
- జున్నులో ఎసిటేట్, ప్రొపియనేట్లు ఉంటాయి.ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచిజబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది.
- జున్నును రెగ్యులర్‌గా తగిన మోతాదులో తీసుకుంటే. గుండె పోటు ఇతర గుండె జబ్బులు రాకుండా ఉంటాయట.
- ప్రతి రోజు తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.