తుంగతుర్తి నియోజకవర్గం టికెట్ రాకపోవటంపై ఎలాంటి బాధ లేదంటూ వీడియో రిలీజ్ చేశారు అద్దంకి దయాకర్. టికెట్ రాకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయని.. ప్రతి నిర్ణయం వెనక ఎంతో చర్చ జరుగుతుందని వివరించారాయన. తుంగతుర్తి టికెట్ మందుల శ్యామూల్ కు ఇవ్వటాన్ని స్వాగతించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను.. స్వాగతిస్తున్నాను అని స్వయంగా వెల్లడించారు అద్దంకి దయాకర్. నవంబర్ 10వ తేదీ ఈ మేరకు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Also Read :-హుస్నాబాద్ ఎమ్మెల్యేపై పొన్నం చార్జిషీట్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల శ్యామూల్ కు మద్దతు ఇస్తున్నానని.. ప్రచారం చేసి గెలుపునకు కృషి చేస్తానని.. సోనియాగాంధీకి గిఫ్ట్ ఇస్తానంటూ ప్రకటించారాయన. ప్రతి నిర్ణయం వెనక చాలా కారణాలు ఉంటాయని.. వాటిని గమనించాలని.. పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఎవరూ ఎలాంటి కామెంట్లు చేయొద్దని అభిమానులను కోరారు అద్దంకి దయాకర్.
తుంగతుర్తి టికెట్ విషయంలో అధిష్టాన నిర్ణయం శిరోధార్యం.పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను.
— Addanki Dayakar (@ADayakarINC) November 10, 2023
క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీకార్యకర్తగా,తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చేందుకు తనవంతు కృషి చేస్తా. pic.twitter.com/5oiKzSHFyo