పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా : అద్దంకి దయాకర్

పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేసే చట్టం వస్తేనే ఫిరాయింపు పరిష్కారం దొరుకుతుందన్నారు టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి  అద్దంకి దయాకర్.  పార్టీ ఫిరాయింపులపై  హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.  హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉందన్నారు. 

గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,సంపత్ కుమార్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు అద్దంకి దయాకర్.  బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు పోయే హక్కు ఉన్నా..   నైతికంగా వాళ్ళు ఆ చాన్స్  కోల్పోయారని చెప్పారు.  రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండొద్దనేది అందరి ఉద్దేశమన్నారు.  బీఆర్ఎస్ చేసిన ప్రాక్టిసెస్ అన్ని రాష్ట్రాలలో చేయాలని చూస్తున్నాయన్నారు.  ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూలగొట్టి మళ్ళీ ఏర్పాటు చేశార్నారు.  కర్ణాటకలో అదే తరహాలో ప్రభుత్వం ఏర్పాటును  చూశామన్నారు.

ALSO READ : BRS పెట్టిన బొక్కల పూడ్చడానికే సగం పైసలు పోతున్నయ్: మంత్రి కోమటిరెడ్డి

పార్టీ ఫిరాయించిన  ఎమ్మెల్యేల అర్హత పిటిషన్ లపై షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను చీప్ జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం కొట్టివేసిన సంగతి తెలిసిందే. తగిన సమయంలో  స్పీకరే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై స్పీకరే నిర్ణయం తీసుకోవాలి..అదే సమయంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఐదేండ్ల పదవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది.