ఆనాడూ ఇలాగే స్పందిస్తే బాగుండేది : అద్దంకి దయాకర్

ఆనాడూ ఇలాగే స్పందిస్తే బాగుండేది : అద్దంకి దయాకర్
  • హైకోర్టు తీర్పుపై దయాకర్ 

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత అద్దంకి దయా కర్ చెప్పారు. అయితే గతంలోనూ కోర్టు ఇలాగే స్పందించి ఉంటే బాగుండేదని, బీఆర్ఎస్​లో కాంగ్రెస్ ఎల్పీ విలీనమయ్యేది కాదని అన్నారు. మీడియాకు సోమవారం అద్దంకి దయాకర్ ఒక వీడియోను విడుదల చేశారు. ‘‘పార్టీ మారిన బీఆర్ఎస్​ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్​ను హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం.

అయితే, ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ లో చేరుతున్నా హైకోర్టు స్పందించలేదు. ఇప్పటిలా స్పీడ్​గా స్పందించి ఉంటే పరిస్థితులు ఇంకోలా ఉండేవి’’ అని వీడియోలో అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. హైకోర్టు పరిధిలోనే స్పీకర్, కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ‘‘కేసీఆర్ తీసుకున్న అనైతిక నిర్ణయాల వల్లే రాష్ట్రంలో ఇలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read :- ఖమ్మం జిల్లాలో వరద నష్టం రూ.340 కోట్లు

కేసీఆర్ వైఫల్యాలతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీపై నమ్మకం లేక కాంగ్రెస్ లోకి వస్తున్నారు. కేసీఆర్ బయటకు రాకపోవడంతో పాటు కేటీఆర్, హరీశ్​రావు మధ్య నాయకత్వ సమస్యలు ఉండడం వల్లే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​ను వీడుతున్నారు’’ అని తెలిపారు.