
బర్త్ డేకు అని ఇంటికి పిలిపించి మత్తుమందు ఇచ్చి తనపై ఎస్సై అత్యాచారం చేశాడని ఓ యవతి బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో అద్దంకి ఎస్సైగా పనిచేసిన సమందర్‌వలీ తాను విధులు నిర్వర్తించే సమయంలో తనను పుట్టినరోజు పేరుతో ఇంటికి పిలిపించాడని, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని బాధిత యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.
అంతేకాకుండా అశ్లీల చిత్రాలు తీశాడని, పెళ్లి చేసుకోమని అడిగితే చంపుతానని బెదిరించినట్లుగా తన ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బి.రమేష్‌బాబు వెల్లడించారు.