సీఎల్పీ, టీడీఎల్పీని విలీనం చేసుకుంది మరిచారా?

సీఎల్పీ, టీడీఎల్పీని విలీనం చేసుకుంది మరిచారా?

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకొని సీఎల్పీ, టీడీఎల్పీలను విలీనం చేసుకోలేదా అని ప్రశ్నించారు. మీరు చేస్తే ఒప్పు.. తాము చేస్తే తప్పా అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు.