అశ్వారావుపేట వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ స్టూడెంట్ తల్లి మందలించడంతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం...అశ్వారావుపేట పట్టణానికి చెందిన భానుప్రియ కొడుకు అక్షయ్ (15) 10వ తరగతి చదువుతున్నాడు. అక్షయ్ కొద్ది రోజులుగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. ఈ కారణంతో చదువులో వెనుకబడడంతో తల్లి మందలించింది.
ఇంకోసారి గేమ్స్ ఆడొద్దని, చదువుపై దృష్టి పెట్టాలని వార్నింగ్ ఇచ్చింది. దీంతో మనస్తాపం చెందిన అతడు బుధవారం తెల్లవారుజామున గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఉదయం ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు తెరిచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సాయంతో కిందకు దించి చూడగా అప్పటికే ప్రాణాలు పోయాయి. పోలీసులు డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.