సిద్దిపేట టౌన్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలను పాటించాలని అడిషనల్కలెక్టర్అబ్దుల్హమీద్ సూచించారు. శనివారం ఆయన సిద్దిపేట కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రక్రియ భిన్నమైన పద్ధతిలో ఉంటుందని, కాబట్టి ఈసీఐ మార్గదర్శకాలు తప్పకుండా పాటించాలన్నారు.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, వివిధ ఫంక్షన్ల పేరుతో పార్టీల మీటింగ్ పెట్టడం, ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు తీసుకురావడం, స్కూళ్లలో ప్రచారం చేయడం వంటివి చేయకూడదన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఎవో అబ్దుల్ రెహమాన్, కాంగ్రెస్ ప్రతినిధి ప్రభాస్, బీజేపీ ప్రతినిధి విభూషణ్ రెడ్డి, ఎంఐఎం పార్టీ ప్రతినిధి మునీద్ పాల్గొన్నారు.