ఓటర్ ​లిస్టుపై అభ్యంతరాలు చెప్పండి :అడిషనల్ ​కలెక్టర్​ అబ్దుల్ హమీద్ 

ఓటర్ ​లిస్టుపై అభ్యంతరాలు చెప్పండి :అడిషనల్ ​కలెక్టర్​ అబ్దుల్ హమీద్ 

సిద్దిపేట టౌన్, వెలుగు: ఈ నెల 7న జిల్లాలో పెండింగ్​లో ఉన్న 17 జీపీల ఓటర్ల లిస్ట్ ను ఫైనల్ చేస్తామని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. మంగళవారం స్థానిక ఎన్నికల ప్రిపరేషన్ కు సంబంధించి సిద్దిపేట కలెక్టరేట్ లో డీపీవో దేవకీదేవితో కలిసి రాజకీయం పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్​కలెక్టర్​మాట్లాడుతూ..

ఈ నెల 5వరకు ఓటర్​లిస్ట్​పై ఆబ్జెక్షన్స్ స్వీకరించి 6 న పరిష్కరించి, 7న తుది ఓటర్ జాబితాను ప్రచురిస్తామని చెప్పారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అత్తూ ఇమామ్, గయాసుద్దీన్, మోహన్​లాల్, మధుసూదన్ రెడ్డి, బాబు, యాదగిరి, ఉమేశ్ రాజు,  పున్నం రెడ్డి, జగదీశ్, రామలింగారెడ్డి పాల్గొన్నారు.

ఓటర్​జాబితాపై అవగాహన సమావేశం

మెదక్​టౌన్: జిల్లాలోని జీపీల ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో మెదక్​కలెక్టరేట్​లో సమావేశం నిర్వహించినట్లు అడిషనల్​ కలెక్టర్​నగేశ్​తెలిపారు. ఓటర్ జాబితా, బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్స్​లు, పోలింగ్ మెటీరియల్, సంబంధిత విషయాలపై రాజకీయ నేతలకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితాను అనుసరించి ఓటర్ జాబితాను సిద్ధం చేశామన్నారు. సమావేశంలో డీపీవో యాదయ్య, ఆయా పార్టీల నాయకులు ఖాలెక్​, నర్సమ్మ, ఆంజనేయులు, సిద్దిరాములు, నరేందర్, విజయలక్ష్మి పాల్గొన్నారు.