నవీపేట్, వెలుగు : ఎల్ఆర్ఎస్కు సంబంధించిన ప్రతీ అప్లికేషన్ పరిశీలించి సర్వేను త్వరగా పూర్తి చేయాలని, ఆన్ లైన్ లో ఎప్పటికి అప్పుడు నమోదు చేయాలని నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.
మండలంలోని జన్నేపల్లి గ్రామంలో జరుగుతున్న ఎల్ఆర్ఎస్ సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. ఎక్కడెక్కడ అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయని ఎంపీడీవో నాగనాథ్ ను అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు. అడిషనల్కలెక్టర్ వెంట డివిజన్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీవో రామకృష్ణ ఉన్నారు.