నవీపేట్, వెలుగు : మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ను అడిషనల్ కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అనంతగిరిలో గ్రామసభను తనిఖీ చేశారు. అనంతరం మోడల్ స్కూల్, హాస్టల్ ను తనిఖీ చేసి మెనూ ప్రకారం ఫుడ్ పెడుతున్నారా లేదా చార్ట్ ను పరిశీలించి వంటను పరిశీలించడంతో గుడ్లు పెట్టడం లేదదని, మెనూ ప్రకారం వార్డెన్ పై అసహనం వ్యక్తం చేశారు.
ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కేజీబీ పర్యవేక్షణ అధికారికి సోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు ఫుడ్ మెను ప్రకారం అందించాలని, లేనిపక్షంలో అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయనవెంట ఎంపీడీవో నాగనాథ్ ఉన్నారు.