బాల్కొండ, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల స్కీం లబ్ధిదారుల ఎంట్రీ మొబైల్ యాప్ సర్వేను పక్కాగా చేపట్టాలని సిబ్బందిని అడిషనల్ కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. బుధవారం బాల్కొండ, చిట్టాపూర్ లో చేపట్టిన సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వేలో ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా ఆన్లైన్ చేయాలన్నారు. పురాతన ఇళ్లల్లో నివాసముండే వారు అదే స్థలంలో కొత్తగా నిర్మించుకునేందుకు ముందుకువస్తే వారి వివరాలను యాప్ లో ఎంట్రీ చేయాలని అన్నారు.
అర్హతగల లబ్ధిదారుల ఎంపిక విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తనిఖీ చేసే సమయంలో ఆన్లైన్ కొద్దిసేపు పనిచేయలేదు.అందుకు ప్రత్యామ్నాయంగా రెండు మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీధర్, ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, ఎంపీవో గంగామోహన్,సెక్రటరీ రజనీకాంత్ రెడ్డి,జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే పరిశీలన
భిక్కనూరు, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పక్కాగా చేయాలని కామారెడ్డి జిల్లా అడిషనల్కలెక్టర్శ్రీనివాస్, డీఎల్పీవో శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆఫీసర్లతో మాట్లాడుతూ.. అర్హులను గుర్తించాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే పూర్తి చేయాలన్నారు. భిక్కనూరు మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే శరవేగంగా జరుగుతోందని ఎంపీడీవో రాజ్కిరణ్రెడ్డిని అడిషనల్ కలెక్టర్, డీఎల్పీవోలు అభినందించారు. వారి వెంట సెక్రటరీ దయాకర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.