సూర్యాపేట, వెలుగు : సర్పంచుల పదవీ కాలం ముగియనుండడంతో గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకాన్ని చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ... జీపీల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించవద్దన్నారు.
ఇప్పటివరకు 56 శాతం ఇంటి పన్నులు వసూలు అయ్యాయని, నిర్దేశించిన గడువులోగా 100 శాతం వసూలు చేయాలని ఎంపీవోలకు సూచించారు. సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి కూడా పన్నులు వసూలు చేయాలన్నారు. జీపీ భవనాలు, కాంపౌండ్ వాల్స్, స్కూళ్లలో అదనపు గదులు నిర్మాణం, రిపేర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు ఈ గ్రామ్ స్వరాజు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సురేష్ కుమార్, డీఆర్డీవో కిరణ్ కుమార్, డీపీవో యాదయ్య, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.