రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. శనివారం తెల్లాపూర్మున్సిపల్ ఆఫీసులో కొల్లూర్ 1, 2లో పట్టాలు పొందిన ఇండ్ల యజమానులు, సొసైటీ సభ్యులతో సమావేశమైన పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ల వద్ద సమస్యలు, వసతుల ఏర్పాటుపై అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పట్టాలు పొందిన వారంతా ఐకమత్యంగా ఉండాలని సూచించారు.
జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖల నుంచి లబ్ధిదారులకు అందాల్సిన సౌకర్యాలన్నింటినీ కల్పిస్తామని, పూర్తి స్థాయిలో సొసైటీలు ఏర్పడితే షాపులను కేటాయిస్తామని తెలిపారు. చిన్న సమస్యలను ఇళ్ల యజమానులే పరిష్కరించుకోవచ్చని సూచించారు. త్వరలోనే బస్సు సౌకర్యం, ఇంటి నంబర్ల కేటాయింపు, కరెంట్, తాగునీరు ఏర్పాటవుతాయన్నారు. పీహెచ్సీ, అంగన్ వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు.
అనంతరం మున్సిపల్ఆఫీస్ వెనకాల నిర్మాణ దశలో ఉన్న ఫంక్షన్ హాల్, శ్రీశక్తి మహిళా క్యాంటీన్, బీటీ రోడ్లను పరిశీలించిన అడిషినల్ కలెక్టర్ త్వరలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి, డీఈఈ సత్యనారాయణ, ఏఈఈ మౌనిక, సీపీడీవో జయరాం, ఆర్ వో వెంకటరామయ్య, మేనేజర్అఖిల్, ఏఈ సత్యనారాయణ, సైట్ ఇంజినీర్ప్రణీత్ పాల్గొన్నారు.