జిల్లాకు ఏడు నేషనల్​ క్వాలిటీ అస్యూరెన్స్​ స్టాండర్డ్స్​ అవార్డులు

జిల్లాకు ఏడు నేషనల్​ క్వాలిటీ  అస్యూరెన్స్​ స్టాండర్డ్స్​ అవార్డులు
  • అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాకు ఏడు నేషనల్​ క్వాలిటీ అస్యూరెన్స్​ స్టాండర్డ్స్​ అవార్డులు రావడం అభినందనీయమని అడిషనల్​ కలెక్టర్​ డి. వేణుగోపాల్​ పేర్కొన్నారు. కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో అవార్డులు పొందిన హాస్పటల్స్​కు ఆయన అవార్డులను అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగభూపాలెం, ఓల్డ్​ అంజనాపురం, టేకుల చెరువు, సీతారం పురం, మారాయి గూడెం, చాతకొండ, దుమ్ముగూడెం పీహెచ్​సీలతో పాటు ​పాల్వంచ సీహెచ్​సీలకు ఏడు నేషనల్​ క్వాలిటీ స్టాండర్డ్స్​ అవార్డులు వచ్చాయన్నారు.ఈ ప్రోగ్రాంలో డీఎంహెచ్​ఓ ఎల్​. భాస్కర్​ నాయక్​, డీసీహెచ్​ఎస్​ డాక్టర్​ రవిబాబు, డాక్టర్లు స్పందన, బాలాజీ, డిప్యూటీ డెమో ఫైజ్​ మోహినుద్దీన్​ పాల్గొన్నారు.