- అడిషనల్ కలెక్టర్ డేవిడ్
మహబూబాబాద్,వెలుగు : వేసవిలో తాగునీటి కొరత రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ డేవిడ్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పంచాయతీ, మున్సిపల్, నీటిపారుదల ఇంజనీరింగ్, మిషన్ భగీరథ ఆఫీసర్లతో వేసవిలో వచ్చే తాగునీటి కొరతపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నీటి సమస్య రాకుండా ప్రత్యేమ్నాయ మార్గాలను అందుబాటులోకి తేవాలన్నారు.
అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని కోరారు. వెంటనే జిల్లాలోని బోర్ల పనితీరుపై నివేదికలు ఇవ్వాలన్నారు.చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో రమాదేవి, సీపీవో సుబ్బారావు, ఇరిగేషన్ ఈఈ సమ్మిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్భన్, వెలుగు : వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యూ ఎస్, పంచాయతి రాజ్, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలతో వేసవిలో మంచినీటి సరఫరాపై కలెక్టర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి మండలంలో ప్రజాప్రతినిధులు, జీపీ స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓలు
తహసిల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, మిషన్ భగీరథ ఆఫీసర్లను సమన్వయ పరచుకుంటూ మీటింగ్లు ఏర్పాటు చేసి మండలాల వారిగా గ్రామాలలో ఉన్న తాగునీటి సమస్యలను గుర్తించాలని అన్నారు. గ్రామాలలో ఉన్న బోర్లు, హ్యాండ్ పంప్స్, పైప్ లైన్ లీకేజీలు, ఓ.హెచ్.ఎస్.ఆర్ నీటి ట్యాంకులు, గేట్ వాల్స్ లీకేజీలు, పైప్ లైన్ మరమ్మతులు, ఈ మీటింగ్ అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పి సీఈఓ విజయలక్ష్మి, మిషన్ భగీరథ ఈ ఈ నిర్మల, డీఆర్డీఓ నరేష్, డీపీఓ నారాయణరావు, అన్ని మండలాల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.