ఆసిఫాబాద్ జిల్లాలో మోడల్ హౌస్​ పనులు వెంటనే పూర్తిచేయాలి : అడిషనల్ కలెక్టర్ ​దీపక్ తివారీ

ఆసిఫాబాద్ జిల్లాలో మోడల్ హౌస్​ పనులు వెంటనే పూర్తిచేయాలి : అడిషనల్ కలెక్టర్ ​దీపక్ తివారీ

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ మోడల్ ఇండ్ల నిర్మాణ పనులను వెంటనే కంప్లీట్ చేయాలని అడిషనల్ కలెక్టర్ ​దీపక్ తివారీ ఆదేశించారు. రెబ్బెన మండలంలో కొనసాగుతున్న ఇందిరమ్మ మోడల్ హౌసింగ్ సైట్ నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాలను పూర్తిచేసుకోవాలన్నారు. అనంతరం మండలంలోని పాసిగావ్ గ్రామంలో మోడల్ ఇండ్ల నిర్మాణ పనులు, తాగునీరు, ప్రత్యామ్నాయ మార్గాలు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ నీరు అందని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎల్ఆర్ఎస్ నిర్వహణ ప్రక్రియపై పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించారు. రెబ్బెన మండలంలో భూముల క్రమబద్దీకరణ పథకం లక్ష్యాన్ని ఈ నెల 31వ తేదీలోగా  పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీపీవో బిక్షపతి, హౌసింగ్ డీఈ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు