భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను రైతులకు పరిచయం చేసి సాగులో ఆధునిక టెక్నాలజీని వాడేలా ప్రోత్సహించేందుకు వన్డే – వన్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్టు అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. రాంబాబు తెలిపారు. నాబార్డ్, టీఎస్ఐసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో గురువారం ఆయన ఎగ్జిబిషన్ ప్రారంభించారు.
వ్యవసాయం, సాగునీటి వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ, పాడి పరిశ్రమ, గ్రామీణ సంఘాల బలోపేతం తదితర అంశాల్లో 30 మంది ఆవిష్కర్తల ప్రయోగాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నామని అన్నారు. ఆవిష్కర్తలతో రైతులు నేరుగా మాట్లాడి అవగాహన పెంచుకునేందుకు ఈ ఎగ్జిబిషన్ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రోగ్రాంలో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ అభిమన్యుడు, హార్టికల్చర్ ఆఫీసర్ మరియన్న, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సంజీవరావు, జిల్లా సైన్స్ ఆఫీసర్ చలపతిరాజు, తులు పాల్గొన్నారు.