- ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీజ
ఖమ్మం టౌన్, వెలుగు : రోడ్డు భద్రత ప్రమాణాలపై ప్రజల్లో అవగాహనకు ప్రచారం చేపట్టాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వద్ద తప్పనిసరిగా స్కూల్ జోన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు.
ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే 1033 కు ఫోన్ చేయాలని, దీనిపై ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం కల్పించాలన్నారు. ఆర్టీసీ బస్సులు బస్ స్టాప్, బస్ బేల వద్ద ఆపాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అంబులెన్స్ వచ్చేందుకు ఆటో అడ్డ వద్ద ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ ఆర్ అండ్ బీ హేమలత, డీపీవో ఆశాలత, డీఎంహెచ్వో కళావతి బాయి, ఆర్టీవో వెంకటరమణ, ఏసీపీ శ్రీనివాసులు, విద్యా శాఖ ఆర్ఎంవో రాజశేఖర్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ రాంబాబు, లారీ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రఘురాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.