ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పీ. శ్రీజ అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలతో సర్వే సన్నద్ధత పై, ధాన్యం, పత్తి కొనుగోళ్లపై సమీక్షించారు. సర్వే నిర్వహణకు ప్రాథమిక పాఠశాల టీచర్లను ఎన్యుమరేటర్లుగా వినియోగించాలన్నారు.
స్కూళ్లు ఉదయం ఒక పూట మాత్రమే ఉంటాయని, మధ్యాహ్నం నుంచి టీచర్లు సర్వేలో పాల్గొనేలా చూడాలని చెప్పారు. జిల్లాలో 5 మండలాల పరిధిలో ఉన్న 9 పత్తి కొనుగోలు కేంద్రాలను సంబంధిత తహసీల్దార్లు సందర్శించి రిపోర్ట్ అందించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయాలని చెప్పారు. అవసరమైన గన్ని సంచులు ఆర్డర్ పెట్టాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, సీపీవో ఏ. శ్రీనివాస్, డీఈవో సోమశేఖర శర్మ, డీఆర్డీవో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు