యాదాద్రి, వెలుగు : ట్రాక్టర్ లోన్లు, సీసీ చార్జెస్‌లో పెండింగ్‌లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ జీ వీరారెడ్డి ఆదేశించారు. గురువారం పంచాయతీల కార్యకలాపాలపై కలెక్టరేట్‌లో నిర్వహించిన రివ్యూలో మాట్లాడారు. జనవరి చివరిలోగా 85 శాతం హౌస్ టాక్స్ వసూలు చేయాలని, ఆడిట్ అభ్యంతరాలపై సమాధానాలు రాయాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ సిబ్బంది జీతాలు పెండింగ్ పెట్టొద్దన్నారు. పంచాయతీల కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మీటింగ్‌లో డీపీవో సునంద, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్లు సాధన, యాదగిరి, ఎంపీవోలు ఉన్నారు.