రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమచేయండి: కలెక్టర్ గరిమా అగర్వాల్​

రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమచేయండి: కలెక్టర్ గరిమా అగర్వాల్​

సిద్దిపేట రూరల్, వెలుగు: రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను వెంటనే జమచేయాలని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్​ అన్నారు. బుధవారం కలెక్టర్ ఆఫీస్ లో బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారులతో రైతు రుణమాఫీ పై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 1,64,895 రైతులకు రూ. 1271.22 కోట్ల రుణమాఫీ వర్తించనుందని, రూ. లక్షా 20 వేల లోపు రుణం ఉన్న 84797 మంది రైతులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 463.21 కోట్లు ఖాతాలో జమ చేసిందన్నారు. ఇంకా 76 , 667 మంది రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉందన్నారు. అనంతరం స్ట్రీట్ వెండర్ రుణాల కోసం బ్యాంకర్లతో మాట్లాడారు. 

మెన్స్ట్రువల్​ కప్స్​ పంపిణీ 

సిద్దిపేట పట్టణంలోని 14, 42 వ వార్డుల్లో ‘ఋతుప్రేమ’ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్​ పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ మంజులతో కలసి మహిళలకు ఉచితంగా మెన్స్ట్రువల్​ కప్పులు, సానిటరీ ప్యాడ్లు అందించారు. మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, కౌన్సిలర్లు అల్లకుంట కవిత అశోక్, కాటం శోభ రఘురాం పాల్గొన్నారు.