మెట్ పల్లి, వెలుగు: సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గౌతమ్‌రెడ్డి సూచించారు. ఆదివారం మెట్‌పల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో సౌకర్యాలపై విద్యార్థులను ఆరా తీశారు. టాయిలెట్లు, శానిటేషన్, తాగునీరు, భోజనం తదితర విషయాలపై వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు.
కిచెన్ పరిశీలించి బియ్యం, ఆయిల్ ప్యాకెట్ల నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్టల్‌లోని 48 మంది స్టూడెంట్స్‌కు అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట బల్దియా కమిషనర్ మోహన్, ఎంపీడీవో రామకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రత్నాకర్, విష్ణు, ముజీబ్, నర్సయ్య, అశోక్, నిజాం, నరేశ్ పాల్గొన్నారు.