బియ్యం డెలివరీని వేగవంతం చేయాలి : అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్

బియ్యం డెలివరీని వేగవంతం చేయాలి : అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్

హాలియా, వెలుగు : 2024 –-25 ఖరీఫ్ సీజన్ బియ్యం డెలివరీని వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం ఫీలిపిన్స్ దేశానికి బియ్యం ఎగుమతి చేస్తున్న వజ్రతేజ రైస్ క్లస్టర్ ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్​కలెక్టర్​మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగా ఫీలిపిన్స్ దేశానికి హాలియాలోని వజ్రతేజ రైస్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. 

2023–24లో రబీ కింద మిల్లర్లకు 80,769 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అందజేశామని, అందులో భాగంగా 1906 ఏసీకేల సీఎంఆర్ బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 1594 ఏసీకేల బియ్యాన్ని డెలివరీ చేశారని, ఇంకా 312 ఏసీకేల బియ్యాన్ని మిల్లర్లు  డెలివరీ చేయాల్సి ఉందని వివరించారు. మార్చి 17లోపు బియ్యాన్ని డెలివరీ చేయాలని, లేదంటే మిల్లర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.