నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలి : జితేశ్​వీ పాటిల్​

కామారెడ్డి టౌన్, వెలుగు: నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ​జితేశ్​వీ పాటిల్​ అధికారులకు సూచించారు. బుధవారం కామారెడ్డి ఆర్డీవో ఆఫీస్​లో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను అడిషనల్​కలెక్టర్ ​చంద్రమోహన్​తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ... నామినేషన్ ​పత్రాలు, అఫిడవిట్​లను నింపడంలో అభ్యర్థులకు సహకరించాలన్నారు. అభ్యర్థి గదిలోకి ఎంట్రీ కాగానే కనిపించేలా డిజిటల్​గడియారం, సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు తమ వెహికిల్స్​ను నామినేషన్​సెంటర్​కు వంద మీటర్ల దూరంలో పార్కింగ్ ​చేసుకునేలా  బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రిటర్నింగ్​ఆఫీసర్​శ్రీనివాస్​రెడ్డి, తహసీల్దార్​ లత తదితరులు ఉన్నారు.