నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: భూ సేకరణను స్పీడప్ చేయాలని అడిషనల్ కలెక్టర్ కె సీతారామారావు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో రెవెన్యూ, నీటి పారుదల, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మహాత్మా గాంధీ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, మార్కండేయ, అచ్చంపేట, కర్నేతండా, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలన్నారు.
అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైవే 167కు సంబంధించిన భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని కోరారు. ఎంజీకేఎల్ఐ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ రెడ్డి, పీఆర్ఎల్ఐ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యాదగిరి, ఆర్డీవోలు సురేశ్, మాధవి, శ్రీను పాల్గొన్నారు.