సెప్టెంబర్ 30లోగా సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యం పూర్తి చేయాలి : అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్

సెప్టెంబర్ 30లోగా సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యం పూర్తి చేయాలి  : అడిషనల్  కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30లోగా సీఎంఆర్ లక్ష్యం పూర్తి చేయాలని అడిషనల్  కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు. శుక్రవారం రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లర్లతో రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  2023–--24 వానకాలం సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి 1,34,861 క్వింటాళ్ల రా రైస్ ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటిదాకా 63,742 క్వింటాళ్లు మాత్రమే ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐకి అప్పగించారన్నారు. మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని వచ్చేనెల 30లోగా తిరిగి అందజేయాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గడువు పెంచే ప్రసక్తే లేదన్నారు. ఈ సందర్భంగా గన్నీ బ్యాగులు సమస్యను పరిష్కరించాలని మిల్లర్లు అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ ను కోరారు. సమావేశంలో డీఎస్‌‌‌‌‌‌‌‌వో జితేందర్ రెడ్డి, మేనేజర్ జితేంద్ర ప్రసాద్, డీటీలు పాల్గొన్నారు.

 
ధరణి దరఖాస్తులపై శ్రద్ధ పెట్టాలి 

ధరణి దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్డీవోలు, తహసీల్దార్లతో  రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.